నేడు, రేపు మద్యం షాపుల మూసివేత

హోళీ కారణంగా ప్రభుత్వం ఈ నిర్ణయం

Liquor shops will be closed today and tomorrow due to the Holi festival
Liquor shops will be closed today and tomorrow due to the Holi festival

Hyderabad: ఈనెల 29,30 తేదీలు హోళీ కారణంగా తెలంగాణలో ఇవాళ, రేపు రెండు రోజులపాటు మద్యం షాపులు తెరిచి ఉండడం లేదు. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి మంగళవారం సాయంత్రం వరకు మద్యం షాపులను మూసేస్తున్నారు.

హోలీ వేడుకల్లో పాల్గొనేవారు మద్యం సేవించి ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదు అని పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. అటు హోళీ వేడుకలపై కూడా పోలీసులు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో హోళీ వేడుకలపై ఆంక్షలు విధించారు. . ఎవరింట్లో వారు హోళీ చేసుకోవాలని, కరోనా దృష్ట్యా ఎక్కువమంది ఒకచోట గుమిగూడవద్దని హెచ్చరిస్తున్నారు

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/