ఆస్ట్రేలియాకు టీమిండియా భారీ టార్గెట్‌

india vs australia
india vs australia

రాజ్‌కోట్‌: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా 341 పరుగుల భారీ టార్గెట్‌ను నిర్దేశించింది. శిఖర్‌ ధావన్‌(96; 90 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్స్‌), విరాట్‌ కోహ్లి(78;76 బంతుల్లో 6 ఫోర్లు), కేఎల్‌ రాహుల్‌( 80; 52 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు), రోహిత్‌ శర్మ(42; 44 బంతుల్లో 6ఫోర్లు)లు రాణించడంతో టీమిండియా భారీ స్కోరు సాధించింది. టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా ముందుగా ఫీల్డింగ్‌ ఎంచుకుంది. దాంతో టీమిండియా ఇన్నింగ్స్‌ను రోహిత్‌శిఖర్‌ ధావన్‌లు ఆరంభించారు. వీరిద్దరూ సమయోచితంగా ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు తీసుకెళుతున్న క్రమంలో రోహిత్‌ తొలి వికెట్‌గా ఔటయ్యాడు. ఈ జోడి మొదటి వికెట్‌కు 81 పరుగులు జోడించింది. ఆపై ధావన్‌కు కోహ్లి జతకలిసి ఇన్నింగ్స్‌ను నడిపించాడు. ఈ క్రమంలోనే ధావన్‌ హాఫ్‌ సెంచరీ నమోదు చేశాడు. ఈ జోడి 103 పరుగులు జత చేసిన తర్వాత ధావన్‌ రెండో వికెట్‌గా ఔటయ్యాడు. కాసేపటికి శ్రేయస్‌ అయ్యర్‌(7) పెవిలియన్‌ చేరాడు. జంపా బౌలింగ్‌లో షాట్‌ ఆడబోగా అది మిస్‌ కావడంతో బౌల్డ్‌ అయ్యాడు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/