నిర్భయ కేసులో మేము అలసత్వాన్ని ప్రదర్శించలేదు
ఉరిశిక్షను త్వరగా అమలు చేయాలనే తాము భావిస్తున్నాం

న్యూఢిల్లీ: నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు ఆలస్యానికి ఢిల్లీ ప్రభుత్వమే కారణమంటూ విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. నిర్భయ దోషులకు ఉరిశిక్షను అమలు చేసే విషయంలో తమ పాత్ర ఏమాత్రం లేదని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఈ కేసుకు సంబంధించి తాము ఎలాంటి అలసత్వం ప్రదర్శించలేదని అన్నారు. గంటల వ్యవధిలోనే పేపర్ వర్క్‌ను ఢిల్లీ ప్రభుత్వం పూర్తి చేసిందని చెప్పారు. దోషులకు వీలైనంత త్వరగా ఉరిశిక్షను అమలు చేయాలనే తాము కూడా భావిస్తున్నామని అన్నారు.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/