ఆ భయంతో నేను మ్యాచ్ చూడలేదు – బిగ్ బి

భారత జట్టు టీ20 వరల్డ్ కప్ గెలవడంతో బాలీవుడ్ స్టార్ నటుడు అమితాబ్ బచ్చన్ భావోద్వేగానికి లోనయ్యారు. తాను టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ చూడలేదన్నారు. తాను చూస్తే ఇండియా ఓడిపోతుందనే భయంతోనే మ్యాచ్ సాగినంత సేపు తాను టీవీ ఆన్ చేయలేదని చెప్పుకొచ్చారు. భారత్ గెలిచిందని తెలిశాక కళ్లలో నీళ్లు వచ్చాయని బ్లాగ్లో రాశారు. రెండోసారి టీ20 వరల్డ్ కప్ గెలిచిన భారత్ కు పలువురు సినీ తారలు విషెస్ తెలిపారు.

అప్పుడెప్పుడే 2013లో ధోని నాయ‌క‌త్వంలో భార‌త జ‌ట్టు ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ విజేత‌గా నిలిచింది. మ‌ళ్లీ ప‌ద‌కొండేళ్ల త‌రవాత టీమ్ఇండియా ఖాతాలో మ‌రో ఐసీసీ ట్రోఫీ వ‌చ్చి చేరింది. రోహిత్ శ‌ర్మ సార‌థ్యంలో భార‌త్ 2024 టీ20 ప్ర‌పంచ‌క‌ప్ విజేత‌గా నిలిచింది. శ‌నివారం బార్బ‌డోస్ వేదిక‌గా జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచ్‌లో ఏడు ప‌రుగుల తేడాతో విజ‌యాన్ని అందుకుంది.