నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలుకు తేదీ ఖరారు

ఫిబ్రవరి ఒకటో తేదీన ఉదయం 6 గంటలకు దోషులకు ఉరి తీయాలని ఢిల్లీ కోర్టు తీర్పు

nirbhaya convicts
nirbhaya convicts

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ హత్యకేసు దోషులను ఉరి తీయడానికి కొత్త ముహూర్తం ఫిక్స్ అయింది. ఫిబ్రవరి ఒకటో తేదీన ఉదయం 6 గంటలకు దోషులను ఉరి తీయాలని ఢిల్లీ కోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీశ్ అరోరా శుక్రవారం డెత్ వారెంట్ జారీచేశారు. నిర్భయ దోషులను ఉరి తీయడానికి ఇంకా 14 రోజుల సమయం ఉంది. చట్ట ప్రకారం వారి క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించిన సమయం నుంచి రెండు వారాల పాటు సమయం ఉండాలన్నది నిబంధనగా వస్తోంది. నిర్భయ సంఘటనలో దోషులుగా తేలిన వినయ్ శర్మ, ముఖేశ్ సింగ్, అక్షయ్ కుమార్ సింగ్, పవన్ గుప్తాను జనవరి 22న ఉరి తీయాలని ట్రయల్ కోర్టు న్యాయమూర్తి ఆదేశాలిచ్చారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/