ఏపీలో టీడిపిదే విజయం – ప్రశాంత్ కిషోర్

prashant-kishore

ఏపీలో రాబోయే ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాదించబోతుందని పొలిటికల్ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తెలిపారు. హైదరాబాదులో పత్రికా కాంక్లేవ్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రశాంత్ కిశోర్ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో జగన్ ఓటమి ఖాయమని తేల్చేశారు. ఏపీ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, అందుకే జగన్ ఏం చేసినా ఓటమి తప్పించుకోలేరని అన్నారు. ఏపీలో టీడీపీ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడుంతుందని తెలిపారు. పథకాల పేరిట డబ్బులు ఇస్తే ఓట్లు పడవని ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యానించారు. సంక్షేమానికి అభివృద్ధి తోడైతేనే ప్రజల్లో నమ్మకం కలుగుతుందని వివరించారు.

తెలంగాణలో గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో మాజీ సీఎం కేసీఆర్ కు ఇదే జరిగిందని షాకింగ్స్ కామెంట్స్ చేశారు.ప్యాలెస్‌లో కూర్చుని బటన్స్ నొక్కితే ఎన్నికల్లో ఓట్ల పడవని ప్రశాంత్ కిషోర్ అన్నారు. చదువుకున్న వారు ఉద్యోగాలు కోరుకుంటారని.. ఉచితాలు కాదని అభిప్రాయపడ్డారు. అటు పీకే అభిప్రాయంపై ఫైర్ అవుతున్న వైసీపీ శ్రేణులు.. చాలా సర్వేలు వైసీపీ విజయం ఖాయమని తేల్చాయని అంటున్నారు.