టాయిలెట్‌ పోసిందని పాపను చితకబాదిన అంగన్‌వాడీ టీచర్

దాదాపు 18 నెలల తర్వాత పాఠశాలలు ప్రారంభమయ్యాయి. పాఠశాలలు నడవకపోయిన ప్రభుత్వాలు ప్రభుత్వ టీచర్లకు జీతాలు ఇచ్చాయి. రీసెంట్ గా స్కూల్స్ ప్రారంభం అయ్యాయో లేదో విద్యార్థుల పట్ల కొంతమంది టీచర్లు రాక్షసులుగా ప్రవర్తిస్తున్నారు. క్లాస్ రూమ్ లో అల్లరి చేస్తున్నారని , స్కూల్స్ అద్దాలు పగలగొట్టారని చితకబాదుతున్నారు. ఇప్పటికే ఇలాంటి ఘటనలు వెలుగులోకి రాగా..తాజాగా పశ్చిమగోదావరి జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రంలో ఓ పాప టాయిలెట్ పోసిందని ఓ టీచర్ చితకబాదిన ఘటన వెలుగులోకి వచ్చింది.

పశ్చిమగోదావరి జిల్లా లింగపాలెం మండలం మఠంగూడెంలో ఈ ఘటన జరిగిదని. పాప కు అర్జెంట్ గా టాయిలెట్ రావడం తో ఆపుకోలేక పోసేసింది. క్లాస్ లోటాయిలెట్ పోస్తావని ఆ టీచర్ ఇష్టంవచ్చినట్లు కొట్టింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, స్థానికులు టీచర్‌పై మండిపడుతున్నారు. అయితే గతంలో కూడా కొంతమంది పిల్లలను టీచర్ కొట్టేదని, అంగన్‌వాడీ సరుకులు ఇవ్వకుండా ఇచ్చినట్లు రిజస్టర్‌‌లో రాసేదని పిల్లల తల్లిదండ్రులు చెబుతున్నారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని చెప్పుకొస్తున్నారు.