ప్రధాని మోడీ పర్యటనకు సీఎం కేసీఆర్ దూరం

స్వ‌ల్ప ఆస్వ‌స్థ‌త కార‌ణంగా ప‌ర్య‌ట‌న‌లో పాల్గొన‌ని కేసీఆర్

హైదరాబాద్ : ప్రధాని మోడీ కాసేపట్లో హైదరాబాదులో అడుగుపెట్టబోతున్నారు. ఇక్రిశాట్ 50 ఏళ్ల ఉత్సవాలకు ఆయన హాజరుకానున్నారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు సమతా మూర్తి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. అయితే ప్రధాని కార్యక్రమానికి సీఎం కేసీఆర్ దూరమయ్యారు. స్వల్ప అస్వస్థత కారణంగా ఆయన మోడీ పర్యటకు దూరంగా ఉన్నారు. మరోవైపు ప్రధానికి స్వాగతం పలికేందుకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు గవర్నర్ తమిళిసై, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, చీఫ్ సెక్రటరీ, డీజీపీలు ఇప్పటికే చేరుకున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో నగరంలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

మధ్యాహ్నం 2 గంటల 10 నిమిషాలకు శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌‌పోర్ట్‌కు మోడీ చేరుకుంటారు. అక్క‌డి నుంచి పటాన్ చెరు ఇక్రిశాట్‌ స్వర్ణోత్సవ వేడుక‌ల‌కు వెళ్తారు. ఈ నేప‌థ్యంలో ఇక్రాశాట్ వ‌ద్ద క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేశారు. ముఖ ద్వారం నుంచి 150 మీట‌ర్ల వ‌ర‌కు ఎవ‌రినీ అనుమ‌తించట్లేదు. ఇక్రాశాట్ ప‌రిస‌ర ప్రాంతానికి దూరంగా వెళ్లాల‌ని ఆదేశిస్తున్నారు. త‌నిఖీలు చేసి పాసులు ఉన్న శాస్త్ర‌వేత్త‌ల‌ను మాత్ర‌మే పోలీసులు అనుమ‌తిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/