తెదేపా సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్

చింతలపూడి గ్రామంలో ఉద్రిక్తత

TDP senior leader Narendra arrested

Ponnur: (Guntur District): గుంటూరు జిల్లా సంగం డైరీ చైర్మన్ , తెదేపా సీనియర్ నేత , మాజీ ఎమ్మెల్యే, ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ను ఇవాళ ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. పొన్నూరు నియోజక వర్గం లోని చింతలపూడి గ్రామంలోని నరేంద్ర గృహానికి శుక్రవారం తెల్లవారు ఝామునే భారీ ఎత్తున పోలీసు బలగాలు చేరుకున్నాయి. ఉదయం 7 గంటల సమయంలో ధూళిపాళ్లను అరెస్ట్ చేసినట్టు ప్రకటించారు. దీంతో చింతలపూడి లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు చింతలపూడి చేరుకున్నారు. వీరిని గ్రామంలోకి రాకుండా పోలీసులు అడ్డుకున్నాయి. ధూళిపాళ్ల ను అరెస్ట్ చేసి తీసుకెళ్లే వాహనానికి కార్యకర్తలు అడుగడుగునా అడ్డుపడ్డారు. పోలీసులు బలవంతంగా వారందరినీ పక్కకు నెట్టేసి ఆ వాహనాన్ని ముందుకు తీసుకెళ్లారు. ధూళిపాళ్ల ను అరెస్ట్ చేసి ఎక్కడికి తీసుకెళ్ళింది తెలియక పోవటంతోకార్యకర్తలు ఆందోళన చేపట్టారు.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/