నరేంద్ర కు హైకోర్టులో చుక్కెదురు
క్వాష్ పిటిషన్ కొట్టివేత : విచారణ జరపాలని ఏసీబీకి ఆదేశం

Amaravati: గుంటూరు జిల్లా సంగం డెయిరీ పై వచ్చిన అవినీతి ఆరోపణల కేసులో అరెస్ట్ అయిన చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర కు హైకోర్టులో చుక్కెదురైంది. ధూళిపాళ్ల దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను హైకోర్టు గురువారం కొట్టివేసింది. ధూళిపాళ్ల ను విచారించాలని ఏసీబీ కి హైకోర్టు ఆదేశించింది. ధూళిపాళ్ల నరేంద్ర ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉన్నారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/