నిధుల దుర్వినియోగం ఆరోపణలతోనే అరెస్ట్ : పోలీసులు వెల్లడి
అసైన్డ్ భూముల వ్యవహారంలో ఇటీవల సిఐడి పై ఆరోపణలు గుప్పించిన నరేంద్ర

Ponnur : దక్షిణ భారత దేశంలో ప్రసిద్ధి గాంచిన పాల ఉత్పత్తి దారుల సహకార సమాఖ్య సంగం డెయిరీ చైర్మన్ గా వున్న ధూళిపాళ్ల ను నిధుల దుర్వినియోగం కు సంబంధించి అరెస్ట్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు. అవినీతి నిరోధ శాఖ అధికారులు సైతం పోలీసుల వెంట వుండటం గమనార్హం. ఇదిలా ఉండగా కొద్దిరోజుల క్రితం నరేంద్ర టీడీపీ రాష్ట్ర కార్యాలయం లో మీడియా సమావేశంలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణరెడ్డి పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అసైన్డ్ భూములు వ్యవహారానికి సంబంధించి సి ఐ డి అధికారుల వ్యవహార శైలిపై గత కొద్ది రోజులుగా ధూళిపాళ్ల పెద్ద ఎత్తున ఆరోపణలు చేసిన సంగతి విదితమే . ఈ నేపథ్యంలోనే ధూళిపాళ్ల అరెస్ట్ జిల్లాలో తీవ్ర చర్చనీయాంశమైంది.
తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/