బిజెపి కి రాజీనామా చేసిన దాసోజు శ్రవణ్‌

dasoju-sravan-resigned-from-bjp

హైదరాబాద్ : దాసోజు శ్రవణ్‌ బిజెపి కి రాజీనామా చేశారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు లేఖ రాశారు. బిజెపి లో దశ దిశాలేని రాజకీయ పరిణామాలు కొనసాగుతున్నాయని విమర్శించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బిజెపి అనుసరిస్తున్న తీరు అత్యంత జుగుస్సాకరంగా ఉందని మండిపడ్డారు. నోట్లు పంచి మునుగోడు ఉప ఎన్నికల్లో గెలవాలనుకుంటున్న బిజెపి తీరు పట్ల నిరసన తెలియజేస్తూ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానట్లు తెలిపారు.