హ్యాకింగ్ కు గురైన టిడిపి ట్విట్టర్ అకౌంట్
టిడిపి ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయినట్లు ధృవీకరించిన పార్టీ డిజిటల్ వింగ్
అమరావతిః టిడిపికి చెందిన అధికారిక ట్విట్టర్ ఖాతా(జైటిడిపి) హ్యాకింగ్‌కు గురైంది. ఈ మేరకు టిడిపి డిటిజల్ వింగ్ (ఐటిడిపి అఫీషియల్) శనివారం మధ్యాహ్నం ట్విట్టర్ వేదికగా ఓ ప్రకటన చేసింది. వైఎస్ఆర్సిపి మద్దతుతో కొందరు వ్యక్తులు తమ పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేశారని తెలిపింది. అంతేకాకుండా ఈ కుట్రను ఛేదించి అతి త్వరలోనే టిడిపి ఖాతాను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది.
ఇటీవలే ఓ సారి టిడిపి ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఆ సమయంలో గంటల వ్యవధిలోనే టిడిపి అధికారిక ట్విట్టర్ ఖాతాను తిరిగి అందుబాటులోకి తీసుకురావడంలో ఆ పార్టీ డిటిజల్ బృందం సఫలీకృతమైంది. తాజాగా టిడిపి అధికారిక ట్విట్టర్ ఖాతా హ్యాక్ కావడం గమనార్హం.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/telangana/