రష్యాకు కొత్త అధ్యక్షుడు ఎన్నికయ్యాకే తాము చర్చలు

Zelensky reacts to Russian annexation, says won’t negotiate as long as Putin is

మాస్కోః రష్యా అధ్యక్షుడిగా పుతిన్ ఉన్నంత వరకు ఆ దేశంతో చర్చలు జరపబోమని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ అన్నారు. వీలైనంత తొందరగా ఉక్రెయిన్ ను నాటోలో చేర్చుకోవాలని కూటమిలోని దేశాలను కోరారు. నాటోలో చేరేందుకు తమకు ఉన్న అర్హతలను ఇప్పటికే నిరూపించుకున్నామంటూ ఓ వీడియో రిలీజ్ చేశారు. రష్యాకు కొత్త అధ్యక్షుడు ఎన్నికయ్యాకే తాము చర్చలు జరుపుతామని చెప్పారు. ఉక్రెయిన్ లో తాము స్వాధీనం చేసుకున్న నాలుగు భూభాగాలు రష్యాలో విలీనమైనట్లు అధ్యక్షుడు వాద్లిమిర్ పుతిన్ ప్రకటించారు. విలీన ఒప్పందాలపై డొనెస్కో, లుహాన్స్, జపోరిజియా, ఖేర్సన్ ప్రాంతాలకు చెందిన అధినేతలు సంతకాలు చేశారని… క్రెమ్లిన్ లో జరిగిన కార్యక్రమంలో తెలిపారు. ఉక్రెయిన్ కు చెందిన 15శాతం భూభాగం రష్యాలో విలీనమైందన్నారు.

ఈ నెల 23 నుంచి 27 వరకు నిర్వహించిన రెఫరెండంలో ఎక్కువ మంది విలీనానికి మద్దతు తెలిపినట్లు రష్యా ప్రకటించింది. జపోరిజియాలో 93శాతం, ఖేర్సన్ లో 87శాతం, లుహాన్స్క్ లో 98శాతం, డొనెస్కో లో 99శాతం మంద ప్రజలు రష్యాలో విలీనానికి అనుకూలంగా ఓటేసినట్లు తెలిపింది. మరోవైపు రష్యా రెఫరెండం బూటకమన్నారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ. పుతిన్ చేసిన ప్రకటన పనికిరాదని చెప్పారు. వాస్తవాలను ఎవరూ మార్చలేరన్నారు. ఉక్రెయిన్ నుంచి రష్యా చివరి సైనికుడిని తరిమే వరకు పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/