ఈ నెల 24 నుండి లోకేశ్‌ యువగళం పాదయాత్ర పునఃప్రారంభం

చంద్రబాబు అరెస్ట్ తో ఆగిపోయిన యువగళం యాత్ర

Nara Lokesh

అమరావతిః స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టిడిపి అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయడంతో ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ నెలకొంది. మరోవైపు, చంద్రబాబు అరెస్ట్ తో ఆగిపోయిన టిడిపి యాత్రలు మళ్లీ పునఃప్రారంభం కానున్నాయి. నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ఈ నెల 24న ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 9న కోనసీమ జిల్లా రాజోలు మండలంలో యువగళం యాత్ర ఆగిపోయింది. ఇప్పుడు అక్కడి నుంచే పునఃప్రారంభవం కానుంది. రేపు సాయంత్రానికల్లా యాత్రకు సంబంధించిన సమన్వయకర్తలు, వాలంటీర్లు రాజోలుకు చేరుకోవాలని పార్టీ నాయకత్వం కోరింది.

లోకేశ్ యాత్ర డిసెంబర్ చివరి వారం వరకు కొనసాగనుంది. యాత్ర పూర్తి అయ్యే సమయానికి ఆయన 3,550 కిలోమీటర్లు నడిచే అవకాశం ఉంది. యువగళం పాదయాత్ర రాజోలు నుంచి పి. గన్నవరం, అమలాపురం, కొత్తపేట, తణుకు, తడేపల్లిగూడెం, కొవ్వూరు, రాజమండ్రి మీదుగా విశాఖ దిశగా సాగుతుంది.