దేశ రాజకీయాల్లో చంద్రబాబుకు అరుదైన గుర్తింపు: లోకేష్

టీడీపీ ఇచ్చిన బంద్ కు ప్రజలు పూర్తిస్థాయిగా సహకరించారు
-తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్

Nara Lokesh talking to the media in Rajamendravaram on Monday evening

రాజమహేంద్రవరం : అధికారంలో ఉన్నంతకాలం ప్రజలు, రాష్ట్రం, దేశం గురించి తప్ప మరొక ఆలోచన చేయని వ్యక్తి చంద్రబాబు అని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. పరిశ్రమలు అభివృద్ధి, ఉద్యోగాలు, సంక్షేమం తప్ప అవినీతి చంద్రబాబు రక్తంలోనే లేదని పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం రాజమహేంద్రవరంలో లోకేష్ మీడియాతో మాట్లాడారు. దేశ రాజకీయాల్లోనే చంద్ర బాబు అరుదైన గుర్తింపు పొందారని , దేశంలోనే కాదు..ప్రపంచంలో అందరికీ తెలుసు అన్నారు. బిల్ గేట్స్, బిల్ క్లింటన్, ఫార్టూన్ కంపెనీల సీఈవోలను అడిగినా చంద్రబాబు గురించి చెబుతారని పేర్కొన్నారు.

అలాంటి వ్యక్తిపై దొంగ కేసులు పెట్టి జైలుకు పంపింది సైకో జగన్ ప్రభుత్వమని . అందుకే ఎప్పుడూ లేని విధంగా ప్రజల్లో భారీ స్పందన వచ్చిందన్నారు. టీడీపీ ఇచ్చిన బంద్ కు ప్రజలు పూర్తిస్థాయిలో సహకరించారని తెలిపారు. స్వచ్ఛందంగా ప్రజలు ముందుకు వచ్చారు. బంద్ ను విజయవంతం చేసిన ప్రజలు, కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, అన్నలాంటి పవన్ కళ్యాణ్ , సీపీఐ రామకృష్ణ, మందకృష్ణమాదిగకు ధన్యవాదాలు చెప్తున్నానని అన్నారు.

సైకో జగన్ చేసిన అతిపెద్ద తప్పు చంద్రబాబు జోలికి రావటమే అని, దీనికి రాజకీయంగా, వ్యక్తిగతంగా వారు చాలా మూల్యం చెల్లించుకుంటారని అన్నారు.
జగన్ కు అధికారం అంటే తెలియదని . అధికారం అంటే యువతకు ఉద్యోగాలు , .పరిశ్రమలు తీసుకురావాలని , కానీ జగన్ దృష్టిలో మాత్రం అధికారం అంటే కక్ష సాధింపులు, దొంగ కేసులు, హింసించడం, దాడులు చేయడమే అని పేర్కొన్నారు.

పాముకు తలలో మాత్రమే విషముంటుందని , సైకో జగన్ కు ఒళ్లంతా విషం ఉందన్నారు. చంద్రబాబుపై అవినీతి మరక వేసేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని , ఇది ఎవరూ నమ్మడం లేదన్నారు. వెస్ట్ బెంగాల్ సీఎం మమతా కూడా, జోహో సిఇఓ శ్రీధర్ అరెస్టును ఖండించారని తెలిపారని చెప్పారు.
పింక్ డైమండ్, బాబాయ్ హత్యకేసు, కోడి కత్తికేసులో చంద్రబాబు ప్రమేయంపై ఎంత నిజముందో ఈ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో కూడా అంతే నిజం ఉందన్నారు.
అధికార బలంతో చంద్రబాబును అరెస్టు చేశారు తప్ప ఆధారాలతో చేయలేదని , చంద్రబాబు అకౌంట్లోకిగానీ, బంధువుల అకౌంట్లోకి గానీ డబ్బులు వచ్చినట్లు నిరూపించలేదన్నారు .

జగన్ చరిత్ర ఏంటి, ఆయనపై ఎన్ని కేసులున్నాయి..ప్రజలకు సమాధానం చెప్పగలరా? అని ప్రశ్నించారు. మొత్తం 32 కేసులున్నాయని . 10 సీబీఐ, 7 ఈడీ కేసులు, 21 ఇతర కేసులు ఉన్నాయని చెప్పారు. . అయిదేళ్లుగా అవి ట్రయల్ కు కూడా రావడం లేదని , దీంతో వ్యవస్థలను ఎంత మ్యానేజ్ చేస్తున్నారో తెలుస్తోందని పేర్కొన్నారు. . బాబాయ్ హత్య కేసులో నిందితులను జగన్ కాపాడుతున్నాడని , అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు సీబీఐ వస్తే కర్నూలులో లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందని పోలీసులను అడ్డంగా పెట్టుకుని అరెస్టు కాకుండా చూసుకున్నాడని వ్యాఖ్యానించారు.

ఛార్జ్ షీట్ లో దోషిగా ఉన్న వ్యక్తిని టీటీడీ బోర్డు మెంబర్ గా చేశారని , జగన్ కు ఉన్న మరక అందరికీ అంటించాలని చూస్తున్నాడని అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుపై అవినీతి ముద్రపడలేదని . కానీ జగన్ సైకో ఇజం ఎంత పీక్ స్టేజ్ లో ఉందో అర్థమైందన్నారు.
స్కిల్ డెవలెప్మెంట్ కేసు ఫేక్ కేసు అని చెబుతూ, ఇందులో చంద్రబాబు సంతకంకానీ, చంద్రబాబుకు డబ్బులు రావడం … వచ్చాయని రిమాండ్ రిపోర్టులో కూడా చూపించలేకపోయిందన్నారు. 2013లో గుజరాత్ సీఎంగా మోడీ ఉన్నారని , ఇదే ప్రాజెక్టును గుజరాత్ లో అమలు చేశారని గుర్తు చేశారు. ఇదే కంపెనీ సీఈఓలు ప్రాజెక్టు పనుల్లో సంతకాలు చేశారని చెప్పారు. గుజరాత్ పాటు 7 రాష్ట్రాల్లో ఈ ప్రాజెక్టును అమలు చేస్తున్నారని లోకేష్ తెలిపారు.

జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/category/news/national/