అసెంబ్లీలో ‘చిడ‌త‌లు’ వాయించిన టీడీపీ స‌భ్యులు: స్పీక‌ర్ ఆగ్ర‌హం

అమరావతి : నేడు ఏపీ అసెంబ్లీ స‌మావేశాల్లో గంద‌ర‌గోళం నెల‌కొంది.. టీడీపీ స‌భ్యులు అసెంబ్లీలో చిడ‌త‌లు వాయించారు. టీడీపీ స‌భ్యుల‌పై స్పీక‌ర్ త‌మ్మినేని ఫైర్ అయ్యారు. బ‌య‌టికి వెళ్లి భ‌జ‌న చేసుకోవాల‌ని తెలిపారు. సంస్కారం, ఇంగిత జ్జానం లేదా? అని ప్ర‌శ్నించారు. టీడీపీ స‌భ్యులు శాసనసభ గౌర‌వాన్ని త‌గ్గించేలా ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. స‌భ్యుల నుంచి చిడ‌త‌లు లాక్కోవాల‌ని మార్ష‌ల్స్ కు ఆదేశాలు జారీ చేశారు.

సభలో విజిల్స్ కూడా ఎందుకు వేశార‌ని, ఇటువంటి భజనలు ఇక్కడ కాకుండా వేరే చోట్ల చేసుకోవాల‌ని అన్నారు. ఎమ్మెల్యేల‌కు ఓటేసిన ప్రజలు చూస్తున్నారని, ఇటువంటి పిల్ల చేష్టలు త‌గ‌వ‌ని చెప్పారు. చంద్రబాబు నాయుడు చివ‌ర‌కు చిడతలు కొట్టుకోవాల్సిందేనంటూ వైస్సార్సీపీ స‌భ్యులు స‌భ‌లో ఎద్దేవా చేశారు. టీడీపీ సభ్యులు సభకు మ‌ద్యం తాగి వ‌స్తున్నారేమోన‌ని ప‌లువురు వైస్సార్సీపీ ఎమ్మెల్యేలు అనుమానాలు వ్య‌క్తం చేశారు. క‌ల్తీ సారా మ‌ర‌ణాల‌పై అసెంబ్లీలో చ‌ర్చించేందుకు ఏపీ ప్ర‌భుత్వం భ‌య‌ప‌డుతోంద‌ని టీడీపీ నేత‌లు మండిప‌డ్డారు.

కాగా, ఏపీ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ సవరణ బిల్లు -2022ను నేడు మంత్రి బుగ్గన మండలిలో ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు. అలాగే, ఏపీ మ్యూచ్‌వల్లీ ఎయిడెడ్ కోఆరపరేటివ్ సోసైటీస్ బిల్లు-2022ను మంత్రి కన్నబాబు మండలిలో ప్ర‌వేశపెడ‌తారు.
.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/