అధికారులకు సిఎం కెసిఆర్‌ ఆదేశాలు

వైస్ చాన్సలర్ల నియామకాలు త్వరగా పూర్తి చేయాలి

TS CM KCR
TS CM KCR

హైదరాబాద్‌: సిఎం కెసిఆర్‌ తెలంగాణలో వివిధ యూనివర్సిటీలకు వైస్ చాన్సలర్లను నియమించే ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. వీసీల నియామక ప్రక్రియలో భాగంగా సెర్చ్ కమిటీల నుంచి పేర్లు తెప్పించుకుని, తొలుత ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్లను నియమించాలని, తద్వారా వీసీల నియామకం మరింత సులువు అవుతుందని కేసీఆర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ ప్రకియ యావత్తు మరో రెండు, మూడు వారాల్లో ముగియాలని స్పష్టం చేశారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/