కాకినాడలో దారుణం..యవతి గొంతు కోసిన ప్రేమోన్మాది

Murdered

అమరావతిః కాకినాడ జిల్లా పెదపూడి మండలం కాండ్రేగుల వద్ద దారుణం సంభవించింది. తన ప్రేమను నిరాకరించిందన్న కక్షతో ఓ ప్రేమోన్మాది యువతిని దారికాసి గొంతుకోసి దారుణ హత్య జరిగింది. గుబ్బల వెంకట సూర్యనారాయణ అనే యువకుడు కూరాడకు చెందిన యువతిని ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతున్నాడు. అందుకు ఆమె నిరాకరించడంతో ఆమెపై కోపాన్ని పెంచుకున్నాడు.

ఇవాళ కూరాడ-కాండ్రేగుల గ్రామాల మధ్య నడుచుకుంటూ వస్తున్న యువతిపై దాడి చేసి గొంతుకోశాడు. కొనా ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న యువతిని స్థానికులు చూసి 108 అంబులెన్స్​కు ఫోన్ చేశారు. అంబులెన్స్ వచ్చేసరికి యువతి ప్రాణం పోయింది. పారిపోయేందుకు యత్నించిన ప్రేమోన్మాదిని చెట్టుకు కట్టేసి స్థానికులు చితకబాదారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువకుడిని అదుపులో తీసుకున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/