కాసేపట్లో ఈడీ ఆఫీస్ నుండి బయటకు రానున్న ఎమ్మెల్సీ కవిత

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదురుకుంటున్న ఎమ్మెల్సీ కవిత..నేడు ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈ నెల 11 న మొదటిసారి హాజరుకాగా..దాదాపు 9 గంటలపాటు విచారించారు. నేడు మరోసారి హాజరు కాగా..దాదాపు 08 గంటలుగా విచారణ కొనసాగుతుంది. మరికాసేపట్లో కవిత బయటకు రానున్నట్లు తెలుస్తుంది.

కవితను ఈ ఉదయం 11 గంటల నుంచి ఈడీ అధికారులు విచారిస్తున్నారు. ఈడీ సంధించిన పలు ప్రశ్నలకు కవిత నుంచి ఎలాంటి రియాక్షన్ కూడా లేదని తెలియవచ్చింది. కవిత, అరుణ్‌ పిళ్లైని కలిపి ఈడీ అధికారులు విచారించారు. ముఖ్యంగా పిళ్లైతో కవితకు ఉన్న వ్యాపార సంబంధాలు, లిక్కర్ స్కాంలో సౌత్‌ గ్రూప్ పాత్రపై కవితను ఈడీ ప్రశ్నించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కన్‌ఫ్రంటేషన్ పద్దతిలో కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారించారు. సాయంత్రం సమయానికి కవిత తరపున ముగ్గురు లాయర్లతోపాటు.. ఇద్దరు డాక్టర్లు ఆఫీసులోకి వెళ్లటంతో ఉత్కంఠ నెలకొంది . అర గంట గ్యాప్ లోనే.. ఇద్దరు డాక్టర్ల బృందం ఈడీ ఆఫీసులోకి వెళ్లింది. 30 నిమిషాల తర్వాత డాక్టర్ల బృందం బయటకు వెళ్లిపోయింది. ఇందులో ఒకరు మహిళా డాక్టర్ ఉన్నారు. ఏంజరగబోతుందా అని టెన్షన్ పడ్డారు. మరి వారు ఎందుకు లోనికి వెళ్లారనేది తెలియాల్సి ఉంది. కాసేపట్లో కవిత బయటకు వస్తారు..మరి ఆమె మీడియా తో మాట్లాడతారా..లేదా అనేది చూడాలి.