నేడు గ‌వ‌ర్న‌ర్ ను క‌ల‌వ‌నున్న టీడీపీ నేత‌లు

అమరావతి: ఏపీ లో టీడీపీ వ‌ర్సెస్ వైస్సార్సీపీ వార్ కొన‌సాగుతూనే ఉంది. గుడివాడ‌ క్యాసినో వ్య‌వ‌హారం రాష్ట్ర రాజ‌కీయాల‌ను రంజుగా మార్చింది. టీడీపీ, వైస్సార్సీపీ నేత‌లు ఒక‌రిపై ఒక‌రు ఆరోప‌ణ‌లు చేసుకుంటున్నారు. అయితే ఈరోజు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ను టీడీపీ నేతలు కలవనున్నారు. గుడివాడలో జరిగిన క్యాసినోపై ఆయనకు ఫిర్యాదు చేయనున్నారు. చంద్రబాబు నియమించిన నిజనిర్ధారణ కమిటీ ఈరోజు ఉదయం 11.30 గంటలకు గవర్నర్ తో సమావేశమై తమ వద్ద ఉన్న ఆధారాలను సమర్పించనుంది. గవర్నర్ క్యాసినో వ్యవహారంపై జోక్యం చేసుకోవాలని టీడీపీ నేతలు కోరనున్నారు. కొడాలి నానిని మంత్రివర్గం నుంచి బర్త్ రఫ్ చేయాలని వారు గవర్నర్ ను కోరనున్నారు. గుడివాడలో సంక్రాంతి సందర్భంగా మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో క్యాసినో నిర్వహించారని ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/