జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం

ఇద్దరు మృతి

Two killed in road mishap on national highway

Chilakaluripet (Guntur district): చెన్నై- కలకత్తా 16వ నెంబరు జాతీయ రహదారిపై ప్రకాశం జిల్లాలో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జె.పంగులూరు మండలం రేణంగివరం వద్ద సుబాబుల్ లోడు ట్రాక్టర్ ను వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.  మరో ఇద్దరికి గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

చిలకలూరిపేట పట్టణం లోని పండరీపురం వాటర్ ట్యాంకులు ఎదురు సోదా వెంకట్రావు, కళావతి దంపతులు కిరాణా దుకాణం నిర్వహిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ప్రసన్న,  భాస్కర్ లు ఉన్నారు. పెద్ద కుమారుడు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్నాడు. చిన్న కుమారుడు భాస్కర్ ను అమెరికా పంపించేందుకు చెన్నై ఎయిర్ పోర్టుకు కారులో బుధవారం రాత్రి వెళ్లారు. ఫ్లైట్ ఎక్కించి వెంకట్రావు, కళావతి, ప్రసన్నతిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో ప్రమాదం జరిగింది. వెంకటరావు, ప్రసన్న మృతి చెందగా కళావతి, డ్రైవర్  తీవ్రంగా గాయపడటంతో ఆస్పత్రికి తరలించారు. పొద్దున్నే ఈ విషయంతో చిలకలూరిపేట పట్టణంలోని సాంబశివ నగర్ ప్రాంతంలో విషాదఛాయలు అలముకున్నాయి. 

తెలంగాణ వార్తల కోసం: https://www.vaartha.com/telangana/