చంద్రబాబు ఆరోగ్యం బాగుండాలని ఆకాంక్షించిన టీడీపీ శ్రేణులు

అరెస్ట్ ను నిరసిస్తూ 32వ రోజూ కొనసాగిన ఆందోళనలు

తెలుగు మహిళ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు

Chandrababu’s fans worship in temples to wish Chandrababu good health

Amaravati: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అరెస్ట్ ను నిరసిస్తూ టీడీపీ శ్రేణుల ఆందోళనలు 32వ రోజూ కొనసాగాయి. చంద్రబాబు విడుదల కావాలని కాంక్షిస్తూ చర్చిలు, దేవాలయాల, మసీదులలో ప్రార్థనలు నిర్వహించారు. వివిధ దేవాలయాల్లో తెలుగు మహిళల ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా పఠించారు. బాబుతో నేను కార్యక్రమం ద్వారా ఇంటింటి ప్రచారంతో పాటు ప్రజావేదిక ద్వారా అక్రమ అరెస్ట్ ను ఖండించారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ పాలకొల్లులో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు. చంద్రబాబు ఆరోగ్యంగా ఉండాలని వెంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం ఇస్సపాలెంలో టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు.

చంద్రబాబు ఆరోగ్యం మెరుగుపడాలని ఇస్సపాలెం మహంకాళీ ఆలయం వరకూ పాదయాత్ర చేపట్టారు. ఆలయం ఎదుట వెయ్యి కొబ్బరికాయలు కొట్టారు. చంద్రబాబుకు మద్దతుగా తుళ్లూరులో రాజధాని రైతుల భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. నందిగామ మండలం అంబారుపేట శ్రీ సత్తెమ్మ తల్లి దేవాలయంలో తెలుగు మహిళ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొన్నారు. కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మాలేపాటి సుబ్బానాయుడు సుదర్శన హోమాన్ని నిర్వహించారు. మంత్రాలయం నియోజకవర్గ ఇంఛార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డి, ఆదోని నియోజకవర్గ ఇంఛార్జ్ మీనాక్షి నాయుడు ఆధ్వర్యంలో తారాపురం శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. డోన్ నియోజకవర్గ ఇంఛార్జ్ మన్నే సుబ్బారెడ్డి గారు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వలసల రామకృష్ణ సంఘీభావం తెలిపారు.

TDP fans are protesting the arrest of Chandrababu

ఉదయగిరి నియోజకవర్గంలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం కనపర్రు బాలయేసు చర్చిలో విభిన్న ప్రతిభావంతుల అధ్యక్షులు పూదోట సునీల్ ఆధ్వర్యంలో మోకాళ్లపై నడిచి ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. అరకు నియోజకవర్గం ఇంచార్జ్ కిడారి శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు జీవీ ఆంజనేయులు ఆధ్వర్యంలో మహాత్మ గాంధీ విగ్రహం ఎదుట మోకాళ్ళపై నించొని చేతులుకి సంకెళ్లతో నిరసన తెలిపారు. అద్దంకిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ఆధ్వర్యంలో భారీ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. తిరుపతి నియోజకవర్గంలో వూకా విజయ్ ఆధ్వర్యంలో కొబ్బరికాయలు కొట్టి శ్రీవారికి మొక్కులు చెల్లించారు. మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లిలో వల్లభనేని వెంకట్రావు ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు.

ఈ నిరసన కార్యక్రమాలలో పోలిట్ బ్యూరో సభ్యులు గుమ్మడి సంధారాణి, గోరంట్ల బుచ్చియ్యచౌదరి, బొండా ఉమామహేశ్వరరావు, పార్లమెంట్ అధ్యక్షులు కూన రవికుమార్, తెనాలి శ్రావణ్ కుమార్, జీవి ఆంజనేయులు, ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, గంటా శ్రీనివాసరావు, పిజి.వి.ఆర్ నాయుడు(గణబాబు), వేగుళ్ళ జోగేశ్వరరావు, ఆదిరెడ్డి భవాని, నిమ్మల రామానాయుడు, గొట్టిపాటి రవికుమార్, మాజీ మంత్రులు కిడారి శ్రావణ్, బండారు సత్యనారాయణమూర్తి, గొల్లపల్లి సూర్యరావు, దేవినేని ఉమామహేశ్వరరావు, ప్రత్తిపాటి పుల్లారావు, కన్నా లక్ష్మినారాయణ, పరిటాల సునీత, పల్లె రఘునాథ్ రెడ్డి, భూమా అఖిల ప్రియ, నియోజకవర్గ ఇంఛార్జులు, రాష్ట్ర, మండల నాయకులు, తెలుగు మహిళలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

తెలంగాణ వార్తల కోసం :https://www.vaartha.com/category/telangana/