బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి

పోలవరం నియోజకవర్గంలో ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం

chandrababu naidu
chandrababu naidu

అమరావతి: పశ్చిమగోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గంలో దివంగత ఎన్టీఆర్ విగ్రహాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేశారు. ఈ ఘనపై టిడిపి అధినేత చంద్రబాబు స్పందించారు. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలుగు ప్రజలకు మన దేశంలోనే కాకుండా, ప్రపంచ నలుమూలలా గుర్తింపు తీసుకొచ్చిన మహానుభావుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. అలాంటి వ్యక్తి విగ్రహాలను ధ్వంసం చేయించి, ఆయన ఆనవాళ్లను పెకిలించాలని అనుకోవడం మూర్ఖత్వమని, రాక్షస చర్య అని మండిపడ్డారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/