బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆందోళన ఫై రాహుల్ ట్వీట్

గత మూడు రోజులుగా బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఎండా , వాన ను సైతం లెక్కచేయకుండా తమ డిమాండ్స్ ను పరిష్కరించే వరకు తగ్గిదేలే అన్నట్లు విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికే పలువురు విద్యార్థులతో మాట్లాడినప్పటికీ పూర్తి స్థాయిలో తమ 12 డిమాండ్స్ను పరిష్కరిస్తే తప్ప ఆందోలన విరమించేది లేదని తేల్చి చెపుతున్నారు. ఇక విద్యార్థుల ఆందోళలకు ప్రతిపక్ష పార్టీలు సైతం మద్దతు తెలుపుతున్నాయి. ఇప్పటికే బిజెపి , కాంగ్రెస్ నేతలు దీనిపై స్పందించగా..తాజాగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ ట్విట్టర్ ద్వారా ఈ ఆందోళన ఫై స్పందించారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో విద్యార్థుల పాత్ర మరువలేనిదని అన్నారు. కేసీఆర్ ఇప్పుడు వారి కృషిని మర్చిపోయినట్టు ఉన్నారని ఎద్దేవా చేశారు. విద్యార్థుల డిమాండ్లను సిల్లీగా పేర్కొనడం సరికాదని హితవు పలికారు. అహంకారపూరితంగా వ్యవహరిస్తున్న కేసీఆర్ ప్రభుత్వం విద్యార్థుల శక్తిని తక్కువగా అంచనా వేస్తోందన్నారు. తెలంగాణ విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని రాహుల్ పేర్కొన్నారు.

ఇక ఈరోజు నాల్గో రోజు కూడా విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఇక్కడికి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వస్తున్నారని తెలిసి పోలీసులు పెద్ద ఎత్తున చేరుకొని భారీ ఎత్తున బారిగేట్లు ఏర్పాటు చేసారు.