హరిహర వీరమల్లు తాలూకా క్రేజీ అప్డేట్ ఇచ్చిన కొరియోగ్రఫర్‌ విజయ్‌

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – క్రిష్ కలయికలో తెరకెక్కుతున్న మూవీ హరిహర వీరమల్లు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతుంది. ఈ క్రమంలో కొరియోగ్రఫర్‌ విజయ్‌ ఈ సినిమా తాలూకా క్రేజీ అప్డేట్ ను అభిమానులతో పంచుకున్నారు. గత కొద్దీ రోజులుగా రామోజీ ఫిలిం సిటీలో యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరిస్తుంది టీం. ఈ క్రమంలో ఈ మూవీ తాలూకా మేజర్‌ యాక్షన్‌ పార్ట్‌ పూర్తయింది. ఈ విషయాన్ని యాక్షన్‌ కొరియోగ్రఫర్‌ విజయ్‌ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు. నిరంతరం మద్దతు అందిస్తున్న కల్యాణ్‌ బాబుకు, మీరందిస్తున్న ప్రశంసలు, ప్రేమకు ధన్యవాదాలు. ఇపుడు తర్వాతి సీక్వెన్స్ కోసం ప్రిపరేషన్‌ మొదలైంది..అని విజయ్‌ అప్‌డేట్ అందించారు.

పవన్ కల్యాణ్‌ నుంచి దేవుడి ప్రతిమను అందుకుంటున్న స్టిల్స్ ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు విజయ్‌. ఇపుడీ ఫొటోలు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతున్నాయి. మేఘసూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో వస్తున్న హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు చిత్రంలో బాలీవుడ్ యాక్టర్లు అర్జున్ రాంపాల్‌, న‌ర్గీస్ ఫ‌క్రీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎంఎం కీర‌వాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు‌‌.. ఈ చిత్రాన్ని 2023 వేసవిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.