వైఎస్‌ఆర్‌సిపిలో చేరిన టిడిపి నేత గంజి చిరంజీవి

జగన్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందుతోందన్న చిరంజీవి

tdp-leader-ganji-chiranjeevi-joins-ysrcp

అమరావతిః మంగళగిరిలో టిడిపికి భారీ షాక్ తగిలింది. మంగళగిరి టిడిపిలో కీలక నేత అయిన గంజి చిరంజీవి వైఎస్‌ఆర్‌సిపిలో చేరారు. ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో ఆయన వైఎస్‌ఆర్‌సిపి కండువా కప్పుకున్నారు. గంజి చిరంజీవిని జగన్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

వైఎస్‌ఆర్‌సిపిలో చేరిన అనంతరం మీడియాతో గంజి చిరంజీవి మాట్లాడుతూ, జగన్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని చెప్పారు. వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు. తెలుగుదేశం పార్టీలో బీసీలకు సరైన గౌరవం లేదని విమర్శించారు. నిరంతరం బీసీలను అవమానాలకు గురి చేస్తున్నారని దుయ్యబట్టారు. టిడిపిలో మొత్తం పెత్తనమంతా ఒకే సామాజికవర్గానిదని విమర్శించారు. ఎన్టీఆర్ ఆశయాలకు తూట్లు పొడుస్తూ పార్టీలో బీసీలకు స్థానం లేకుండా చేశారని అన్నారు. టిడిపిలో బీసీలతో పాటు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు కూడా గౌరవం లేదని చెప్పారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/