చింతమనేని ప్రభాకర్‌‌పై నమోదైన కేసు కొట్టివేత

మ‌హిళ‌పై దాడి చేశారంటూ చింత‌మ‌నేనిపై ఫిర్యాదు
అభియోగాలు రుజువు కాక‌పోవ‌డంతో కొట్టేసిన కోర్టు

విజ‌య‌వాడ‌: టీడీపీ సీనియ‌ర్ నేత‌, ఏలూరు జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింత‌మనేని ప్ర‌భాక‌ర్‌పై న‌మోదైన కేసును విజ‌య‌వాడ‌లోని ప్రజా ప్ర‌తినిధుల కోర్టు కొట్టివేసింది. ఈ మేర‌కు శుక్ర‌వారం నాడు ఈ కేసుపై విచార‌ణ చేప‌ట్టిన కోర్టు…చింత‌మ‌నేనిపై అభియోగాల‌ను పోలీసులు నిరూపించ‌లేక‌పోయార‌ని అభిప్రాయ‌ప‌డింది. ఈ నేప‌థ్యంలోనే చింత‌మ‌నేనిపై కేసును కొట్టివేస్తున్న‌ట్లు కోర్టు ప్ర‌కటించింది.

2011లో ఓ మ‌హిళ‌పై దాడి చేశారంటూ చింత‌మ‌నేనిపై అందిన ఫిర్యాదు ఆధారంగా ఆయ‌న‌పై ఏలూరు పోలీస్ స్టేష‌న్‌లో ఓ కేసు న‌మోదైంది. ఈ కేసుపై సుదీర్ఘ విచార‌ణ జ‌ర‌గ‌గా… కేసులో చింత‌మ‌నేనిపై న‌మోదు చేసిన అభియోగాలు రుజువు కాలేదు. దీంతోనే కోర్టు ఆయ‌న‌పై న‌మోదైన ఈ కేసును కొట్టివేసింది.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/