చావుబతుకుల్లో ఉన్న అభిమానిని పలకరించిన ఎన్టీఆర్

రోడ్డు ప్రమాదంలో గాయపడి చావుబతుకుల్లో ఉన్న అభిమానిని ఎన్టీఆర్ పలకరించి అతడిలో సంతోషం నింపారు. తెరపై మాత్రమే కాదు తెర వెనుక కూడా మన హీరోలు రియల్ హీరోలు అనిపించుకుంటారు. తమను ప్రాణంగా అభిమానించే అభిమానులకోసం ఎన్ని చెయ్యాలో అన్ని చేస్తారు. వారు ఆపద లో ఉంటె వారికీ అండగా ఉంటారు. ముఖ్యంగా చావుబతుకుల్లో ఎవరైనా ఉంటె వారి చివరి కోరికను తీరుస్తుంటారు. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా అదే పనిచేసారు.

తూర్పు గోదావరి జిల్లా రాజోలుకు చెందిన కొప్పాడి మురళి ఎన్టీఆర్‌కు వీరాభిమాని. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతడి పరిస్థితి మరింతగా విషమించింది. ఈ క్రమంలో వైద్యులు అతడి కోరికలు, ఇష్టాఇష్టాలను తెలుసుకునే ప్రయత్నం చేశాడు. దీంతో అతడు తన మనసులోని మాటను బయటపెట్టాడు. ఎన్టీఆర్‌తో మాట్లాడాలని ఉందని చెప్పాడు. దీంతో వైద్యుల ద్వారా విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ వీడియో కాల్ చేసి మురళితో మాట్టాడారు. త్వరగానే కోలుకుంటావంటూ అతడిలో ధైర్యం నింపారు. సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా తిరిగి వస్తావంటూ ఆకాంక్షించారు. ఎన్టీఆర్ ఫోన్ చేసి మాట్లాడడంతో మురళి ఎంతో సంతోషించారు.

ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే..ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్లో చరణ్ తో కలిసి ఆర్ఆర్ఆర్ పూర్తి చేసారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ సంక్రాంతి బరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.