తీన్మార్‌ మల్లన్నపై మంత్రి పువ్వాడ పోలీసులకు పిర్యాదు

teenmar mallanna

క్యూ న్యూస్ అధినేత తీన్మార్ మల్లన్న ఫై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కార్యదర్శి ఎస్. కిరణ్ కుమార్ పోలీసులకు పిర్యాదు చేసారు. పువ్వాడ ఫై మల్లన్న అసత్యపు ప్రచారం చేస్తున్నాడంటూ సీపీ సీవి ఆనంద్ కు ఫిర్యాదు చేశారు. మే 13న తీన్మార్ మల్లన్నకు చెందిన దినపత్రికలో కన్ను పడితే కబ్జానే, ఖమ్మం జిల్లాలో మంత్రి పువ్వాడ అక్రమాలు అనే శీర్షికతో నిరాధారమైన తప్పుడు ఆరోపణలు చేశారని అవి మంత్రి వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగించే విధంగా ఉన్నాయని ఫిర్యాదు లో పేర్కొన్నారు.

గత నెలలోను తీన్మార్ మల్లన్న తన యూట్యూబ్ క్యూ న్యూస్ ఛానల్ లో అసత్య ఆరోపణలు చేశారని అదేవిధంగా మంత్రి పువ్వాడ ను విమర్శిస్తూ మల్లన్న మాట్లాడిన భాష జర్నలిజం ప్రమాణాలకు విరుద్ధమైనదని దీనిని ఎవరూ అంగీకరించరని అన్నారు. అజయ్ కుమార్ మీద తీన్మార్‌ మల్లన్న క్యూ న్యూస్‌ యూట్యూబ్‌ చానల్‌ మరియు సోషల్ మీడియా వేదికగా అభ్యంతరకర భాష వాడుతున్నారని, దీనివల్ల టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, మంత్రి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని, అతడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.