పోటీపరీక్షల్లో ఏకాగ్రత ముఖ్యం

మార్గదర్శకత్వంతో విజయానికి చేరువ

Concentration is important in competitive exam

పోటీ పరీక్షల్లో సరైన మార్గదర్శకత్వం విజయానికి చేరువ చేస్తుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చదువుకుని మొదటిసారి పోటీపరీక్షలకు హాజరవుతున్నవారికి సరైన మార్గదర్శకత్వం లేక వారి తొలి ప్రయత్నం వృథా అవుతుంటుంది.

మంచి అధ్యాపకుల్లో, పోటీపరీక్షల్లో సీనియరో, మంచి శిక్షణ సంస్థ మార్గదర్శకత్వం ఇస్తేనో ప్రతిభగల అభ్యర్థులు త్వరగా గ్రహిస్తారు. పోటీపరీక్షల్లో సత్వర ఫలితాలు వస్తాయి. కొన్ని నెలలు లేదా సంవత్సరాల కృషి అనంతరం రాసిన పోటీ పరీక్షల ఫలితాలు ప్రతికూలంగా రావడం నిరాశను కలిగించడం సహజం.

కానీ అసలు వాస్తవం-వైఫల్యానికి కారణమైన ప్రతి నిర్ణయం అభ్యర్థిదే. సరైన వ్యూహం ఎంచుకోకపోయినా, తగిన ప్రణాళిక వేసుకోలేకపోయినా, తీసుకున్న శిక్షణలో తగిన ప్రమాణాలు లేకపోయినా, ఇలా కారణం ఏదైనా ఆ నిర్ణయం సొంతదారు అభ్యర్థే. కాబట్టి, యథాతథంగా దాన్ని స్వీకరించడం మేలు.

ఓటమిని అంగీకరించడం తరువాత సాధించబోయే విజయంలో తొలిమెట్టు. పోటీపరీక్షల ఫలితాలు రావడంతోనే అపజయం చవిచూసిన అనంతరం చాలామంది తక్షణం మళ్లీ సన్నద్ధతలో పడిపోతారు. అయితే వైఫల్యం తాలూకు వేదన మాత్రం మనసును కుదిపేస్తుంటుంది. అలాంటి కల్లోల స్థితిలోనే సన్నద్ధత కొనసాగించడం వల్ల సంపూర్ణ ఏకాగ్రత కుదరదు.

అందుకే కనీసం పక్షం రోజులు సన్నద్ధతకు దూరంగా ఉండి, కల్లోలిత మనసును కుదుటపడనివ్వాలి. ఇది సమయాన్ని వృథాచేయడం కాదు. పరుగు పందెంలో మోకాలుపై వంగి ఒక కాలు వెనక్కివేసి, తగిన శక్తి పుంజుకునే ప్రయత్నం చేసినట్టు ఈ స్వల్ఫ విరామం రాబోయే పెద్ద ప్రయత్నానికి పునాది అవుతుంది.

ఇలా విరామం తీసుకోవడం వల్ల మనసు కాస్త స్థిమితపడి అంత: విశ్లేషణ మొదలవుతుంది. చేసిన ప్రయత్నంలో అంతర్గతంగా తప్పొప్పుల సమీక్ష జరుగుతుంది. అప్పటికే విజయ సారథుల మనోగతాలు వెల్లడవుతాయి. కాబట్టి, వారితో తన ప్రయత్నాన్ని సరిపోల్చుకోవడానికి వీలవుతుంది.

ముఖ్యంగా ఓటమి పరాభవాన్ని వెనక్కినెట్టి అసలు కారణాల అన్వేషణకు మనసు సిద్ధపడుతుంది.పోటీపరీక్షల్లో ఎదురైన చేదు అనుభవం పరాభవం ఫలితంగా ఉత్పన్న మయ్యే తక్షణ స్పందన దశ నుంచి బయిటపడ్డాక నిజమైన స్వీయ పరిశీలన మొదలవ్వాలి. సాధారణంగా పోటీపరీక్షల్లో పరాజయానికి రెండు కారణాలుంటాయి.

వ్యక్తిగత కారణాలు మొదటి కోవకు చెందితే, సదరు పోటీపరీక్ష సన్నద్ధతలో విషయపరమైన లోపాలు రెండోకోవకు చెందుతాయి. ముందు తనకు మాత్రమే తెలిసిన ఒక్కో తరహా పోటీ పరీక్షకు ఒక్కో ప్రత్యేక పంథాలో సన్నద్ధత అని వార్యమవుతుంది.

సివిల్‌ సర్వీసెస్‌లో విజయానికి ఒక విధమైన సన్నద్ధత అవసరం. వ్యక్తిగత బలహీనతల కారణంగా క్రమశిక్షణ తప్పడం వల్ల విజయానికి దూరమ వుతారు.

కొంతమంది అభ్యర్థులు వ్యక్తిగతంగా మంచి క్రమశిక్షణ చూపుతూ ఎటువంటి చంచలభావం లేకుండా ఒకే ఒక పోటీపరీక్షకు అంకితమై ఏళ్ల తరబడి ప్రయత్నిస్తున్నా సత్ఫలితం రాదు. వ్యక్తి గత కారణాలకంటే సన్నద్ధత పర్వంలో చేసిన పొరపాట్లే విజయాన్ని ప్రభావితం చేస్తాయి. ప్రతి పోటీపరీక్షకు దాని స్వభా వాన్ని బట్టి పటిష్టమైన వ్యూహం అవసరం.

మొత్తం సన్నద్ధతకు వినియోగించే కాలం, సబ్జెక్టువారీ సమయ విభజన, నిపుణుల మార్గదర్శకత్వం, ఏ సబ్జెక్టు ముందు, ఏది తర్వాత, పునశ్చరణ కేటాయించే సమయం తదితర అంశాలు ఈ వ్యూహంలో అంతర్భాగాలు.

వీటిపై అవగాహన లేకపోవడం కూడా పరాజయానికి కారణం అవుతుం ది. పోటీపరీక్షల్లో అధ్యయనానికి ఎంత ప్రాముఖ్యముందో సాధనకూ అంతే ప్రాధాన్యం ఉంటుంది.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/