ఏపీలో 3.5 లక్షల మందికి జనసేన భీమా కిట్..

Pawan Kalyan
Pawan Kalyan

జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులకు బీమా పత్రాలు అందజేయబోతున్నట్లు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ- ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. ఈ నెల 10, 11, 12 తేదీల్లో ప్రతి నియోజకవర్గంలోభీమా పత్రాలను అందజేయబోతున్నట్లు చెప్పుకొచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 3.5 లక్షల మంది క్రియాశీలక సభ్యత్వం పొందారు. వీరికి రూ. 5 లక్షల ప్రమాద బీమా కల్పిస్తున్నట్లు తెలిపారు. భీమా పత్రంతో పాటు పార్టీ అధ్యక్షుల వారి మనోగతాన్ని తెలిపే ప్రతులు, ఐడీ కార్డు, పార్టీ స్టికర్స్‌, పార్టీ క్యాలెండర్‌లాంటి వాటితో కూడిన కిట్‌ను ప్రతి క్రియాశీలక సభ్యుడికీ అందజేస్తున్నారు.

ఈ భీమా అందజేసే కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, కడప, కర్నూలు జిల్లాలకు సమన్వయకర్తలను నియమించారు. కర్నూలు జిల్లాకు బొలిశెట్టి సత్య, నయూబ్‌ కమాల్‌, ఆకేపాటి సుభాషిణి, కడప జిల్లాకు పి. విజయ్‌ కుమార్‌, వడ్రానం మార్కండేయబాబు, పొలసపల్లి సరోజ, శ్రీకాకుళం జిల్లాకు బోనబోయిన శ్రీనివాస యాదవ్‌, ఎ. దుర్గా ప్రశాంతి, తాడి మోహన్‌, విజయనగరం జిల్లాకు పాలవలస యశస్వి, గడసాల అప్పారావు, బేతపూడి విజయశేఖర్‌, విశాఖపట్నం జిల్లాకు చేగొండి సూర్యప్రకాశ్‌, అమ్మిశెట్టి వాసు, ఘంటసాల వెంకటలక్ష్మిలను సమన్వయకర్తలుగా నియమించారు.