టీడీపీ – జనసేన ఫస్ట్ లిస్ట్ రిలీజ్.. కార్యకర్తల్లో అసంతృప్తి..?

TDP-Janasena first list released

ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో అధికార పార్టీ వైసీపీ దూకుడు కనపరుస్తూ వస్తుంది. ఓ పక్క వరుస పెట్టి జాబితాలను రిలీజ్ చేస్తూ..ప్రచారాన్ని మొదలుపెట్టగా..పొత్తులో ఉన్న టిడిపి – జనసేన సైలెంట్ గా ఉండడం తో పార్టీ శ్రేణుల్లో అనేక అనుమానాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో ఇంకా సైలెంట్ ఉండడం , బిజెపి కోసం ఎదురుచూడడం మంచింది కాదని భావించిన బాబు..నిన్న ఏకంగా 94 స్థానాల్లో టిడిపి అభ్యర్థులను , జనసేన 24 స్థానాల్లో పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. అయితే జనసేన కేవలం 05 స్థానాలకు సంబదించిన అభ్యర్థులను ప్రకటించి మిగతావి రెండో జాబితాలో రిలీజ్ చేస్తామని ప్రకటించారు.

ఈ జాబితా వచ్చిన తర్వాత ఒక్కసారిగా రాజకీయ సమీకరణాలు మారాయి. టికెట్ దక్కని నేతలు పార్టీ ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధినేతలు స్వయంగా చెప్పినా క్షేత్రస్థాయిలో ఆ పార్టీల కార్యకర్తల్లో అసంతృప్తి సెగలు పెరుగుతూనే ఉన్నాయి. టికెట్ రాని అభ్యర్థులు, వారి అనుచరులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇన్నేళ్లూ కష్టపడితే చివరి నిమిషంలో సైడ్ చేశారంటూ విమర్శిస్తున్నారు. ఎన్నికలలోపు ఈ ఆవేశాలు సద్దుమణుగుతాయా లేక పరిస్థితి వైసీపీకి ఫేవర్ గా మారుతుందా అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.