సైబర్ క్రైమ్ పోలీసులకు షర్మిల ఫిర్యాదు

Security increased for APCC president YS Sharmila

సోషల్ మీడియా లో తనపై దుష్ప్రచారం చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కొన్ని యూట్యూబ్ చానళ్లు, ఇతర సోషల్ మీడియా సైట్లలో మహిళల ప్రతిష్ఠను దిగజార్చేలా పోస్టులు పెడుతున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాను ఏపీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రజల్ని కలుస్తుండడాన్ని కొందరు సహించలేక దురుద్దేశంతో తనపైన, తన సహచరుల పైన అసభ్య కామెంట్లు పెడుతున్నారని, ఎలాంటి ఆధారాలు లేకుండా పెడుతున్న ఈ పోస్టులు తనను అవమానించేలా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

‘వైఎస్ షర్మిల ప్రాణాలకు ప్రమాదం’, ‘దొంగల ముఠా’, ‘వైఎస్ షర్మిల క్యాంపు కార్యాలయంలో కోవర్టు ఆపరేషన్’ పేరుతో కొన్ని పీడీఎఫ్ కాపీలను సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రధానంగా 8మంది సోషల్ మీడియా ఖాతాలపై ఆమె ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.