టీడీపీ మద్దతు ప్రకటించడం ఆశ్చర్యపర్చలేదుః యశ్వంత్ సిన్హా

రాష్ట్రపతి ఎన్నిక అసాధారణ పరిస్థితుల్లో జరుగుతోందన్న సిన్హా

tdp-decision-to-vote-murmu-does-not-shock-me-say-yashwant-sinha

న్యూఢిల్లీః రాజధాని ఢిల్లీలో నిర్వహించిన విపక్షాల సమావేశానికి టిడిపి ఎందుకు ఆహ్వానించలేదో తనకు తెలియదని విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా తెలిపారు. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు టీడీపీ మద్దతు ప్రకటించడం తనను ఆశ్చర్యపర్చలేదని అన్నారు. ప్రభుత్వమే రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోందని, తన అధికారులను దుర్వినియోగం చేస్తోందని కేంద్రంపై నిప్పులు చెరిగిన యశ్వంత్ సిన్హా.. రాష్ట్రపతి ఎన్నిక అసాధారణ పరిస్థితుల్లో జరుగుతోందన్నారు.

రాష్ట్రపతి ఎన్నికల ప్రచారంలో భాగంగా నిన్న గువాహటి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగాన్ని పరిరక్షించడమే ప్రధాన సవాలుగా ఈ ఎన్నిక జరుగుతోందన్నారు. ఆత్మప్రబోధానుసారం ఓటు వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. టీఆర్ఎస్ తనకు హైదరాబాద్‌లో ఘన స్వాగతం పలికి మద్దతు పలికిందని ఈ సందర్భంగా సిన్హా గుర్తు చేసుకున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/