బింబిసార నుండి ఈశ్వరుడే సాంగ్ రిలీజ్

కళ్యాణ్ రామ్ నటిస్తున్న ‘బింబిసార’ చిత్రం నుండి ఈశ్వరుడే అంటూ సాగే సాంగ్ రిలీజ్ అయ్యింది. కళ్యాణ్ రామ్..ప్రస్తుతం బింబిసార అనే హిస్టారికల్ సినిమాతో అలరించడానికి ఆగస్టు 05 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. క్రీస్తు పూర్వం 5వ శతాబ్దానికి చెందిన మగధ రాజ్యాధిపతే బింబిసారుడు. ఆయన కథతోనే ఈ సినిమా తెరకెక్కుతుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కల్యాణ్ రామ్ బావమరిది హరికృష్ణ నిర్మిస్తున్నాడు. శ్రీ వశిష్ట్ దర్శకత్వంలో రూపొందుతోన్న సోషియో ఫాంటసీ మూవీ గా రానున్న ఈ చిత్రం నుండిఈశ్వరుడే సాంగ్ ను ఈరోజు గురు పౌర్ణమి సందర్బంగా రిలీజ్ చేసారు. ‘భువి పై ఎవడూ కనివిని ఎరుగని అద్భుతమే జరిగినే.. దివిలో సైతం కథగా రాని విధి లీలే వెలిగినే..’ అంటూ సాగిన ఈ పాట శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటోంది. రక్షకుడివో రాక్షసుడివో అంటూ తిగర్తల సామ్రాజ్యపు చక్రవర్తి బింబిసారుడి స్వభావాన్ని ఈ గీతంలో ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. ఈ పాటకు చిరంతన్ భట్ స్వరాలను సమకూర్చగా శ్రీమణి లిరిక్స్ అందించారు. కాలభైరవ ఆలపించారు. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది.

ఇక ఈ మూవీ లో కేథరిన్ థ్రెసా , సంయుక్త మీనన్, వారీనా హుస్సేన్ హీరోయిన్లు గా నటించగా.. వెన్నెల కిషోర్ , బ్రహ్మాజీ , శ్రీనివాస రెడ్డి ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి చిరంతన్ భట్ సంగీతం సమకూర్చగా.. ఎంఎం కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. ఛోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ నిర్వహించారు.