నేడు స‌ర్పంచుల‌తో చంద్ర‌బాబు భేటీ

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈరోజు సర్పంచ్ లతో భేటీ కానున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. రాష్ట్రంలో స్థానిక సంస్థలను ఈ ప్రభుత్వం నీరుగారుస్తుందని, నిధులు, విధులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుందన్న ఆరోపణల నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. నిధులు లేక, గ్రామాల్లో అభివృద్ధి చేయలేక పంచాయతీ సర్పంచ్ లు ఇబ్బంది పడుతున్నారు. ఈసమావేశంలో వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి చంద్రబాబు కార్యాచరణను సిద్ధం చేయనున్నారు. పార్టీకి చెందిన సర్పంచ్ లు ఈ సమావేశానికి హాజరు కావాలని పార్టీ నుంచి పిలుపు అందడంతో ఈ సమావేశానికి హాజరు కానున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/