నాగ‌పూర్ జైలు నుంచి విడుదలైన ప్రొఫెస‌ర్ సాయిబాబ‌

Professor Saibaba was released from Nagpur prison

నాగపూర్‌: ఈరోజు ఢిల్లీ వ‌ర్సిటీ మాజీ ప్రొఫెస‌ర్ జీఎన్ సాయిబాబ‌ను నాగ‌పూర్ సెంట్ర‌ల్ జైలు నుంచి రిలీజ్ చేశారు. మావోల‌తో లింకు ఉన్న కేసులో రెండు రోజుల క్రితం బాంబే హైకోర్టు ఆయ‌న్ను నిర్దోషిగా ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. 2017 నుంచి ప్రొఫెస‌ర్ సాయిబాబ‌.. నాగ‌పూర్ సెంట్ర‌ల్ జైలులోనే ఉంటున్నారు. 2014 నుంచి 2016 వ‌ర‌కు కూడా ఆయ‌న జైలులో ఉన్నారు. ఆ త‌ర్వాత బెయిల్‌పై రిలీజ్ అయ్యారు. ఇవాళ జైలు నుంచి బ‌య‌ట‌కు వెళ్లిన త‌ర్వాత ఆయ‌న మీడియాతో మాడ్లాడారు. త‌న ఆరోగ్యం చాలా బ‌ల‌హీనంగా ఉంద‌ని,ఇప్పుడు తానేమీ మాట్లాడ‌లేన‌ని, ముందుగా మెడిక‌ల్ ట్రీట్మెంట్ తీసుకోవాల‌ని, ఆ త‌ర్వాత తాను మాట్లాడ‌నున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. మావోల‌తో లింకున్న కేసులో సాయిబాబ‌కు జీవిత‌కాల శిక్ష ప‌డింది. అయితే ఆయ‌న‌పై ఉన్న ఆరోప‌ణ‌ల‌ను ప్రాసిక్యూష‌న్ ప్రూవ్ చేయ‌లేక‌పోయింది.