ముంబైలో ఈరోజు ఒక్క రోజే 2,510 కరోనా కేసులు..

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి మరోసారి భయాందోళనకు గురి చేస్తుంది. ముఖ్యంగా ముంబైలో వైరస్ తీవ్రత భారీగా పెరిగింది. నిన్న ముంబైలో 1377 కోవిడ్ కేసులు రాగా.. బుధవారం ఒక్కరోజే కొత్తగా 2,510 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో కరోనా విజృంభణ నేపథ్యంలో మహారాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రే ఒక ప్రణాళికను రూపొందించడానికి ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ఒమిక్రాన్ కేసులతో పాటుగా, కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలోముంబయిలో ఆసుపత్రులలో మౌలిక సదుపాయాలను పెంచి మందులు మరియు ఆక్సిజన్‌ను అందుబాటులో ఉంచాలని భావిస్తున్నారు.

డిసెంబర్ 8 నుండి మూడు వారాల్లో కేసులు 188 శాతం కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. ఇక ఇదే సమయంలో బుధవారం నాడు మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేష్ తోపే తాజా కేసుల పెరుగుదలపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆందోళనకరమైన పరిస్థితి ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో కేసుల సంఖ్య రెట్టింపు కావడం మరియు ముంబైలో పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్య కూడా ఈ రోజు 2200 దాటవచ్చని దాటవచ్చని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.