నేడు ఏలూరు జిల్లాలో పర్యటించనున్న చంద్రబాబు

tdp-chandrababu-west-godavari-tour

అమరావతిః టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు నేడు పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన ‘ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని ఏలూరు జిల్లా, పెదవేగిమండలం, విజయరాయి ప్రారంభించనున్నారు. 50 రోజుల్లో 50 లక్షల కుటుంబాలను కలవడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం కొనసాగనుంది. దీని కోసం మొత్తం 8వేల మంది పార్టీ బృందాలను నియమించారు. ప్రచార వీడియోలను ప్రత్యేకంగా రూపొందించి సామాజిక మాద్యమాల్లో ప్రచారం చేస్తున్నారు. పార్టీ నేతలకు అవసరమైన సమాచారం, ప్రతి ఇంటా ఇవ్వాల్సిన కరపత్రాలు కూడా సిద్ధం చేసి అన్ని నియోజకవర్గాలకు పంపారు. బాదుడే బాదుడు పేరుతో ఆ పార్టీ సుమారు 7, 8 నెలలపాటు ప్రజల్లోకి వెళ్లి ఇంటింటి ప్రచారం చేసింది. దాంతో పోలిస్తే ఇదేం కర్మ కార్యక్రమాన్ని కొంత విభిన్నంగా రూపొందించారు. ముఖ్యమైన ప్రజా సమస్యలను ఎంచుకుని వాటిపై ప్రతి ఇంటా వివరించాలని నిర్ణయించారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/