మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్‌కు టికెట్ ఇవ్వొద్దని BRS కార్యకర్తల తీర్మానం

మహబూబాబాద్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్‌ కు సొంత పార్టీ నేతలే భారీ షాక్ ఇచ్చారు. ఎమ్మెల్యే శంకర్ నాయక్‌కు టికెట్ ఇవ్వొద్దని..ఇస్తే ఖచ్చితంగా ఓడిస్తామని పార్టీ అధిష్టానానికి లేఖ రాసారు. రెండుసార్లు గెలిపిస్తే భూ కబ్జాలు, రక్తపాతం సృష్టించారని, కార్యకర్తలను అణగదొక్కారని కార్యకర్తలు మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో శంకర్ నాయక్ గెలిస్తే మహబూబాబాద్ ను మరో బీహార్ చేస్తారని… కొత్త అభ్యర్థికి టికెట్ ఇవ్వాలని కేసముద్రం, కోడూరు మండలాల మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు తీర్మానం చేశారు. వచ్చే ఎన్నికల్లో శంకర్ నాయక్‌కు టికెట్ ఇస్తే ఓడిస్తామని మహబూబాబాద్ శివారులోని ఓ మామిడి తోటలో 100 మందికి పైగా బీఆర్ఎస్ నేతలు సమావేశమయ్యారు. ఈ రహాస్య సమావేశంలో ముగ్గురు బిఆర్ఎస్ కౌన్సిలర్ కూడా ఉన్నట్లు సమాచారం. ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై తిరుగుబాటు చేశారు. ఇతరులు ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. దీంతో జిల్లాలో మరోసారి మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ హాట్ టాపిక్ గా మారాయి

శంకర్ నాయక్ రాజకీయ విషయానికి వస్తే.. చిరంజీవికి అభిమాని ఆయన శంకర్ ..చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరి ఆ పార్టీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయాడు. 2009లోనే తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీలో చేరి, తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నాడు. 2014లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ నుండి పోటీచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాలోత్ కవితపై 9,315 ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలుపొందాడు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నుండి పోటీచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్పై 13,534 ఓట్ల మెజారిటీతో రెండవసారి ఎన్నికయ్యారు. ఆ తర్వాత పలు వివాదాలతో నిత్యం వార్తల్లో నిలుస్తూ వస్తున్నాడు. పలుమార్లు కేసీఆర్ సైతం శంకర్ నాయక్ ను హెచ్చరించడం జరిగింది. ఆయన కూడా ఆయన లో మార్పు రావడం లేదని సొంత కార్య కర్తలే అంటున్నారు. ఇప్పుడు ఎన్నికల సమయం దగ్గ్గరికి వస్తుండడం తో శంకర్ నాయక్ కు టికెట్ ఇవ్వకూడదని కార్య కర్తలు , పార్టీ కీలక నేతలు అధిష్టానానికి లేఖ రాసారు. మరి రాబోయే ఎన్నికల్లో శంకర్ కు టికెట్ ఇస్తారో లేదో చూడాలి.