జూన్ 1 నుండి ఏపీలో రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచుతూ జగన్‌ సర్కార్‌ నిర్ణయం

ఏపీ ప్రజలకు మరో షాక్ ఇచ్చింది జగన్ ప్రభుత్వం. జూన్ 1 నుండి ఏపీలో రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సోమవారం నుండి రిజిస్ట్రేషన్ల ప్రక్రియను నిలిపేశారు. జూన్1 నుంచి అమల్లోకి పెరిగిన మార్కెట్ ధరలు రానున్నాయి. సర్వర్లు డౌన్ అవటంతో నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు రిజిస్ట్రేషన్లు జరగలేదు.

ఇటు అనంతపురం జిల్లాలో కిటకిట లాడుతున్నాయి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు. అనంతపురం జిల్లాలో రెండవ రోజు రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి . నిన్న ఒక్క రోజు అర్భన్ పరిధిలో ఆగిపోయాయి 60 రిజిస్ట్రేషన్లు. సాంకేతిక సమస్యతో వెబ్ సైట్ తెరుచుకోలేదు. రివర్స్ ప్రింట్ రావడం లేదంటున్నారు అధికారులు. జూన్ 1 నుంచి రిజిస్ట్రేషన్లు ఛార్జీలు పెరుగుతుండడంతో కావాలనే సర్వరు ప్రాబ్లం చెబుతున్నారని కొనుగోలు దారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ధరలు పెరిగే ప్రాంతాలు చూస్తే.. విశాఖ, గాజువాక, ద్వారకానగర్, గోపాలపట్నం, పెందుర్తి, భీమిలి, ఆనందపురం, మధురవాడ.

భూమి విలువ పెంపు ఇలా: డిమాండ్ ఉన్న చోట 60 శాతం, మధ్యస్థంగా ఉన్నచోట 40 శాతం, తక్కువ ఉన్న చోట 30 శాతం మేర భూముల రేట్లు పెంచనున్నట్లు తెలుస్తోంది.