స్వలింగ వివాహాలకు అనుకూలంగా అమెరికా సెనేట్ ఓటు

ప్రతినిధుల సభలో ఆమోదం తర్వాత అధ్యక్షుడి సంతకం

Love is love, says Joe Biden as US Senate passes landmark bill to protect same-sex marriage

వాషింగ్టన్ః అమెరికా సెనేట్ చరిత్రాత్మక స్వలింగ వివాహ బిల్లుకు ఆమోదం తెలిపింది. 50 మంది డెమోక్రాట్ లతోపాటు ఈ బిల్లుకు మద్దతుగా 11 మంది రిపబ్లికన్లు కూడా ఓటు వేయడం గమనార్హం. ‘‘వివాహ చట్టాన్ని గౌరవిస్తూ సెనేట్ లోని ద్విపార్టీ సభ్యులు నేడు ఆమోదించడం అన్నది.. ప్రేమ అంటే ప్రేమే అన్న ప్రాథమిక సత్యాన్ని యునైటెడ్ స్టేట్స్ పునరుద్ఘాటించే అంచున ఉంది’’అంటూ అధ్యక్షుడు జోబైడెన్ ప్రకటన చేశారు.

సెనేట్ ఆమోదం నేపథ్యంలో ఈ బిల్లును ప్రతినిధుల సభకు పంపిస్తారు. అక్కడ ఆమోదం తర్వాత అమెరికా అధ్యక్షుడి సంతకం కోసం బిల్లు వెళుతుంది. అధ్యక్షుడి ఆమోదంతో చట్టరూపం దాలుస్తుంది. అమెరికాలో ఒకే లింగానికి చెందిన వారు వివాహం చేసుకుంటే ప్రస్తుతం రక్షణ ఉంది. 2015 నుంచి సుప్రీంకోర్టు స్వలింగ వివాహాలకు రక్షణ కల్పిస్తోంది. గర్భ విచ్ఛిత్తి హక్కును ఈ ఏడాది జూన్ లో సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో తమ విషయంలోనూ అదే పరిస్థితి రావచ్చన్న ఆందోళన అక్కడి స్వలింగ సంపర్కుల్లో ఉంది. దీంతో డెమోక్రాట్లు ఆగమేఘాల మీద ఈ బిల్లుకు మార్గం చూపించారు. రెండు వేర్వేరు జాతుల మధ్య వివాహానికి కూడా ఈ చట్టం కింద ఆమోదం ఉంటుంది.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/movies/