లోకేశ్ పోరాటం ఫ‌లించింది..అచ్చెన్నాయుడు

ప‌రీక్ష‌ల ర‌ద్దు విద్యార్థులు, వారి తల్లిదండ్రుల‌ విజయం..అచ్చెన్నాయుడు

అమరావతి: విద్యార్థుల‌ ప‌రీక్ష‌ల విష‌యంలో కోర్టు ముట్టికాయలు వేస్తే గాని సీఎం జ‌గ‌న్‌కు దీనిపై స్ప‌ష్ట‌త‌రాలేద‌ని టీడీపీ నేత అచ్చెన్నాయుడు విమ‌ర్శించారు. పరీక్షల రద్దు హర్షణీయమని, ఇది విద్యార్థులు, వారి తల్లిదండ్రుల‌ విజయమని చెప్పారు. విద్యార్థులు, యువత తలుచుకుంటే దేన్నైనా సాధిస్తారని నిరూపిత‌మైంద‌న్నారు. విద్యార్థుల త‌ర‌ఫున‌ నారా లోకేశ్ రెండు నెలల నుంచి అలుపెరగని పోరాటం చేశారని ఆయ‌న చెప్పుకొచ్చారు. నిపుణులతోనూ ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించి అందరినీ ఏకతాటిపైకి తీసుకురావడంలో లోకేశ్ విజ‌యం సాధించార‌ని అచ్చెన్నాయుడు చెప్పారు.

చివ‌ర‌కు ప‌రీక్ష‌లు ర‌ద్ద‌య్యాయ‌ని చెప్పారు. ఏపీ ప్ర‌భుత్వ తీరుతో పరీక్షల విషయంలో విద్యార్థులు, తల్లిదండ్రులను మానసికంగా ఇబ్బందులు ప‌డ్డార‌ని చెప్పారు. దేశ ప్రధాని మోడీ విద్యార్థులు, వారిల‌ తల్లిదండ్రులతో ప‌రీక్ష‌ల‌పై సమీక్షా సమావేశం నిర్వహించి చ‌ర్చించార‌ని అచ్చెన్నాయుడు గుర్తు చేశారు. ఏపీలో మాత్రం జగన్ అలా చేయలేద‌ని, ప్ర‌ధానికి ఉన్న స‌మయంల సీఎంకి లేదా? అని అచ్చెన్నాయుడు విమ‌ర్శించారు. కాగా, ఏపీలో ప‌దో త‌ర‌గ‌తి, ఇంట‌ర్ ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేస్తూ ఏపీ స‌ర్కారు నిర్ణ‌యం తీసుకున్న విష‌యం తెలిసిందే.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/