175 స్థానాల్లో పోటీ చేసే దమ్ముందా అంటూ ఏపీలో వెలిసిన ఫ్లెక్సీలు

ఏపీలో రాజకీయాలు రోజు రోజుకు మరింత వేడెక్కుతున్నాయి. వైస్సార్సీపీ – టీడీపీ – జనసేన పార్టీలు నువ్వా..నేనా అన్నట్లు రాజకీయ వ్యూహాలు రచిస్తున్నాయి. రాబోయే ఎన్నికల్లో జనసేన – టీడీపీ కలిసి పోటీ చేయబోతున్నట్లు తెలుస్తుండడంతో ఆ పార్టీలను ఎదురుకునేందుకు జగన్ తన వ్యూహాల ఫై మరింత పదును పెడుతున్నారు. గత కొద్దీ నెలలుగా 175 స్థానాల్లో పోటీ చేసే దమ్ముందా అంటూ టీడీపీ , జనసేన పార్టీలకు సవాళ్లు విసురుస్తున్నారు. జగన్ తో పాటు ఆ పార్టీ నేతలంతా ఇదే పాట పట్టారు.

ఇక ఇప్పుడు ఏకంగా ప్లెక్సీల రూపంలో సవాల్ విసరడం స్టార్ట్ చేసారు. కొత్తగా గ్రామాల్లోనూ పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టి ప్రజల్లో చర్చ స్టార్ట్ అయ్యేలా వైస్సార్సీపీ సరికొత్త వ్యూహం మొదలుపెట్టింది. తాజాగా.. చిత్తూరు జిల్లాలో పెద్ద పెద్ద హోర్డింగ్స్ దర్శనమిచ్చాయి. ‘చంద్రబాబు కానీ.. దత్తపుత్రుడు కానీ.. దమ్ముందా.. 175కి 175 స్థానాల్లో పోటీ చేసి గెలిచే ధైర్యం ఉందా’ అని ప్రశ్నిస్తూ.. హోర్డింగ్స్ ఏర్పాటు చేశారు. అయితే.. ఈ హోర్డింగ్స్‌పై సోషల్ మీడియాలో కూడా రచ్చ ప్రారంభమైంది. ‘టీడీపీ డిజిటల్ మీడియా’ పేరుతో ఉన్న ట్విట్టర్ ఖాతాలో.. ‘మేము 175 స్థానాల్లో పోటీ చేస్తున్నాము.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాము’ పోస్టు పెట్టారు. అయితే ఈ పోస్ట్ ను టీడీపీ ఖండించింది. ‘ఐదు రూపాయల పేటీఎం బ్యాచ్‌కి తప్పుడు ప్రచారాలు చేయడానికి ఉన్న ట్విట్టర్ అకౌంట్స్ చాలక.. “TDP DIGITAL MEDIA” పేరుతో బ్లూ టిక్ తెప్పించుకొని.. ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చి.. మళ్లీ గెలవాలని ప్రయత్నాలు చేస్తూ.. తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. మీరు ఇలాంటి పేటియం వేషాలు ఎన్ని చేసినా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలదు.. మీకు ఘోర ఓటమి తప్పదు’ అని టీడీపీ ట్వీట్ చేసింది.