వైసీపీకి ఓటు వేసిందన్న కోపంతో కన్న తల్లిని హత్య చేసిన టీడీపీ కార్యకర్త

six-murdered-in-nizamabad-district

వైసీపీకి ఓటు వేసిందన్న కోపంతో కన్న తల్లిని హత్య చేసాడు టీడీపీ కార్యకర్త.. ఈ ఘటన అనంతపురం జిల్లాలోచోటు చేసుకుంది. కంబదూరు మండలం ఎగువపల్లిలో వైసీపీకి ఓటు వేసిందన్న కారణంతో మద్యం మత్తులో కన్న తల్లిని దారుణ హత్య చేసి పరారయ్యాడు కొడుకు. వడ్డే వెంకటేశులు అనే వ్యక్తి టీడీపీ పార్టీలో ఉండగా .. తల్లి వడ్డే సుంకమ్మ(45) మాత్రం వైసీపీ పార్టీకి ఓటు వేసినట్లు కొడుకుతో చెప్పగా కోపంతో ఊగిపై మద్యం సేవించి ఇంటికి వచ్చి తల్లితో గొడవకి దిగాడు.

క్షణికావేశంలో కన్న తల్లి తలపై ఇనుప సుత్తితో బాది హత్య చేశాడు. దీంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. ఈ సమాచారం అందుకున్న కంబదూరు పోలీసులు హత్య జరిగిన ప్రాంతానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. పరారీలో ఉన్న వడ్డే వెంకటేశులు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.