పాకిస్థాన్లో తొలి కరోనా మరణం
ఇరాన్ నుంచి వచ్చిన వ్యక్తికి సోకిన వైరస్..లాహోర్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ మంగళవారం మృతి

ఇస్లామాబాద్: ప్రపంచదేశాలను వణికిస్తున్న మహమ్మారి కరోనా వైరస్. పాకిస్థాన్ తొలి కరోనా మరణం నమోదైంది. ఇరాన్ నుంచి వచ్చిన ఓ వ్యక్తి కరోనా బారిన పడి చనిపోయాడని ప్రభుత్వం మంగళవారం వెల్లడించింది. హఫీజాబాద్కు చెందిన అతను ఇటీవలే ఇరాన్ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చాడు. కరోనా లక్షణాలు ఉండడంతో ఇరాన్జటాఫ్టాన్ సరిహద్దుల్లో అతడిని రెండు వారాల పాటు క్వారెంటైన్లో ఉంచి చికిత్స అందించారు. అయితే, అతని ఆరోగ్యం క్షీణించడంతో లాహోర్లోని మయో ఆసుపత్రిలో చేర్చగా.. చికిత్స పొందుతూ మరణించాడు. కాగా, పాకిస్థాన్లో ఇప్పటిదాకా 189 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని డాన్ పత్రిక తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా లక్షా 80 వేల మందికి ఈ ప్రాణాంతక వైరస్ సోకగా.. ఇప్పటికే ఏడు మందికిపైగా మరణించారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/