కరోనా బారినపడిన పోచారం..ఖంగారు పడుతున్న జగన్, కేసీఆర్

కరోనా మహమ్మారి ఇంకా ఖంగారు పెట్టేస్తూనే ఉంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా ఉదృతి తగ్గినప్పటికీ , సినీ , రాజకీయ నేతలను మాత్రం వదలడం లేదు. ప్రతి రోజు ఎవరో ఒకరు కరోనా బారినపడుతున్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కరోనా బారినపడ్డారు. రెండు రోజులుగా తనలో కరోనా లక్షణాలు కనిపించడం తో ఈరోజు కరోనా టెస్ట్ చేసుకున్నారు. ఈ పరీక్షల్లో శ్రీనివాసరెడ్డి కి కరోనా సోకినట్లు వెల్లడైంది. దీంతో ఆయన హైదరాబాద్లోని ఏఐజీ అనే ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. ఈ విషయాన్ని స్వయంగా పోచారం శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు.

”రెగ్యులర్ మెడికల్ టెస్ట్ లలో భాగంగా నిన్న రాత్రి చేయించిన కోవిడ్ టెస్ట్ లో నాకు పాజిటివ్ నమోదు అయింది. ప్రస్తుతం నాకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేనప్పటికీ డాక్టర్ల సూచనల మేరకు AIG, గచ్చిబౌలి హాస్పిటల్ లో జాయిన్ అయ్యాను..గత కొన్ని రోజులుగా నన్ను కలిసిన, సన్నిహితంగా ఉన్న వారు కోవిడ్ టెస్ట్ చేయించుకుని తగు జాగ్రత్తలతో హోమ్ ఐసోలేషన్ లో ఉండగలరని మనవి” అంటూ పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. కాగా నాల్గు రోజుల క్రితం తన మనవరాలి పెళ్లి రోజున రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో విందులో పాల్గొన్నారు. పోచారం తో కూర్చుని మాట్లాడడం చేసారు. దీంతో ఇప్పుడు పోచారం కరోనా బారినపడడం తో కేసీఆర్ , జగన్ లు కాస్త టెన్షన్ పడుతున్నారు.