మంత్రి హరీష్ రావుకు నిర్మలా సీతారామన్ కౌంటర్

మంత్రి హరీష్ రావు కౌంటర్ కు రీ కౌంటర్ ఇచ్చారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ vs బిజెపి వార్ నడుస్తుంది. గురువారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌.. కేసీఆర్‌ సర్కార్‌పై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. దీంతో నిర్మలా సీతారామన్‌ ఫై మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కౌంటర్ ఇచ్చారు.

బీజేపీ నేతలు దిగజారి మాట్లాడుతున్నారు. ప్రధాని మాటలను దిగజార్చేలా బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు. కేంద్రమంత్రలు నోరు విప్పితే అన్ని అబద్దాలే. బీజేపీ దిక్కుమాలిన రాజకీయాలు చేస్తోంది. పేదలకు మేము ఉచితంగా రేషన్‌ బియ్యం ఇస్తున్నాము. దేశాన్ని సాకే ఐదారు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. ఆయుష్మాన్‌ భారత్‌లో తెలంగాణ చేరలేదని నిరూపిస్తే.. నేను రాజీనామా చేస్తాను. చేరినట్లైతే నిర్మలా సీతారామన్‌ రాజీనామా చేస్తారా? అని కౌంటర్‌ ఇచ్చారు.

మంత్రి హరీష్ రావు కౌంటర్ కు నిర్మలా రీ కౌంటర్ ఇచ్చారు. టీఆర్‌ఎస్‌ సర్కార్‌ బెదిరింపు రాజకీయాలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పక్క రాష్ట్రాలు చూడు అని ఇక్కడి మంత్రి హరీష్‌ రావు అంటున్నారు… ముందు నీ రాష్ట్రం చూడు ఎంత మంది ఆత్మహత్య చేసుకున్నారని ఫైర్‌ అయ్యారు. రైతులపై ప్రేమ ఉంటే ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారని… రైతులకు సహకారం అందిస్తామని ఇక్కడి ప్రభుత్వం చెబుతుందని చురకలు అంటించారు. టిఆర్ఎస్ ప్రభుత్వం 2014 నుంచి తెలంగాణలో 17000 కోట్లు రుణ మాఫీ చేస్తామని చెప్పింది… కానీ 100 మంది రుణాలు తీసుకుంటే 5 గురికి మాత్రమే మాఫీ చేశారని నిప్పులు చెరిగారు.

ఈ విషయాన్ని SBI చెప్పిందన్నారు. తెలంగాణకి పీఎం కిసాన్ సమ్మన్ నిధి కింద 2014 నుంచి ఇప్పటివరకు 7658 కోట్లు ఇచ్చామని, దీని ద్వారా 37.95 లక్షల రైతులకు లబ్ది చేకూరిందని.. కృషి వికాస్ యోజస్ 8590 కోట్లు ఇచ్చామని వెల్లడించారు. మొత్తం రైతుల కోసం తెలంగాణకి 10729 కోట్లు ఇచ్చామని… ఇంకా కేంద్రం ఏమి ఇవ్వట్లేదు అంటున్నారని హరీష్‌ పై మండిపడ్డారు. రైతులు వరి వేసే ఉరే అన్నది మీరేనని చురకలు అంటించారు.