కాంగ్రెస్ పార్టీ వెంటిలేటర్పై ఉందంటూ తరుణ్ చుగ్ ఎద్దేవా

బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ తాజాగా బిఆర్ఎస్ , కాంగ్రెస్ పార్టీల పలు విమర్శలు చేసారు. కేసీఆర్ డిప్రెషన్లో ఉంటే కాంగ్రెస్ పార్టీ వెంటిలేటర్పై ఉందంటూ ఎద్దేవా చేసారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ కలలు కనేదని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కలలు కంటున్నదని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వానిది కుటుంబ, అవినీతి, రైతు, నిరుద్యోగ వ్యతిరేక పాలనని , వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ రాష్ట్రంలోని 119 స్థానాల్లో పోటీ చేయబోతోందని , ప్రధాని మోడీ నేతృత్వంలో తమ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

కేసీఆర్ కుటుంబ పాలనతో తెలంగాణలో అవినీతి బాగా పెరిగిపోయిందని దోచుకోవటమే పరమావధిగా కేసీఆర్ కుటుంబపాలన ఉందని..తెలంగాణ అవినీతి ఢిల్లీ, పంజాబ్ లను కూడా తాకింది అంటూ విమర్శించారు. అసెంబ్లీలో ప్రధాని మోడీ సీఎం కేసీఆర్ చేసిన విమర్శలపై తరుణ్ చుక్ ఆగ్రహం వ్యక్తంచేశారు. సభలో లేని మోడీ గురించి కేసీఆర్ మాట్లాడటం సిగ్గు చేటు అంటూ విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ ఉనికి కోసం ప్రయత్నిస్తుంటే కేసీఆర్ మాత్రం అధికారం పోతుందని పూర్తిగా అర్థమై డిప్రెషన్ లో ఉన్నారంటూ ఎద్దేవా చేశారు.